BREAKING
రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం

కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువైన మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక మాస ప్రాశస్త్యాన్ని చాటుతూ ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, పలు వైదిక క్రతువులు జరిపించారు. సహస్ర లింగార్చనలో భాగంగా స్వామివారిని భక్తిపూర్వకంగా పూజించగా, సహస్ర దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆకాశదీపం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం నిర్వహించిన ఊయల సేవలో స్వామివారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను మరింత పెంపొందించాయి. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన ఈ వైదిక కార్యక్రమాలు భక్తులకు భక్తిపారవశ్యాన్ని అందించాయి.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.