BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం

Select Suryaa Now
బోరు మోటార్, దొంగల అరెస్ట్  మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం

జగదేవపూర్ మేజర్ న్యూస్ ; సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని తిగుల్ గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన సోలార్ బోరు మోటార్, కేబుల్ వైర్ (విలువ సుమారు 80,000) చోరీకి గురైనట్లు బాధితుడు మోసం మాణిక్ స్వామి జగదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఎస్ఐ కృష్ణారెడ్డి గారు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అలిరాజాపేట గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో నిందితులు సుమారు పది రోజుల క్రితం ఫిర్యాదుదారుడు బోరు మోటార్ ఏర్పాటు చేయడానికి తీసుకువచ్చిన సమయంలో కూలీలుగా పనిచేశామని, ఆ సమయంలో అక్కడి పరిస్థితులను గమనించి, తేదీ 27-11-2026 రాత్రి ఎవరూ లేని సమయంలో తిరిగి వచ్చి బోరు మోటార్, కేబుల్ వైర్‌ను దొంగిలించినట్లు అంగీకరించారు.
**నిందితుల వివరాలు:**
1. చాకలి అనిల్, తండ్రి సత్తయ్య, తర్కంపేట గ్రామం, హత్నూర్ మండలం.
2. వనరాస మనోహర్, తండ్రి మొగులయ్య, సూరారం, మేడ్చల్ జిల్లా.
3. చిత్ర రాము అలియాస్ రాములు, తండ్రి తిప్పయ్య, ప్రస్తుతం కలావతి నగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ జిల్లా.పోలీసులు నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన సోలార్ బోరు మోటార్, కేబుల్ వైర్‌తో పాటు నేరానికి ఉపయోగించిన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.