telangana
నేడు మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాక
సూర్య రెంజల్ : నేడు రెంజల్ మండలానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రానున్నట్లు రెంజల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ మోబిన్ ఖాన్ తెలిపారు. పత్రికా ప్రకటనలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రెంజల్ మండలంలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, సంక్షేమ పథకాల కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని సాటాపూర్ సామియా గార్డెన్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇట్టి కార్యక్రమానికి రెంజల్ మండలంలోని సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.