BREAKING
పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ

18 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన పదో తరగతి పూర్వ విద్యార్థులు

Select Suryaa Now
18 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన పదో తరగతి పూర్వ విద్యార్థులు

 

సూర్య వేల్పూరు ;;వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో 2007–08 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. చదువుకునే రోజుల్లో చేసిన అల్లరి, ఆటపాటలు, స్నేహబంధాలను గుర్తు చేసుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఏయే పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి వృత్తుల్లో స్థిరపడ్డారు అనే విషయాలను పరస్పరం తెలుసుకున్నారు. జీవితంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా అందరూ కలిసికట్టుగా అండగా నిలబడి సమస్యలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు.కాలం మారినా, దూరాలు పెరిగినా చిన్ననాటి స్నేహబంధం ఎప్పటికీ చెక్కుచెదరదని ఈ ఆత్మీయ సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది. 18 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.