రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండి సేవ చేయాలి
సూర్య- బిక్కనూర్ ;;రైతులకు పిఎసిఎస్ డైరెక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలని, మండలంలోని కంచర్ల గ్రామస్తులు చెప్పారు. గ్రామానికి చెందిన పెంటల నర్సాగౌడ్, పెంజర్ల శేఖర్ లు పెద్దమల్లారెడ్డి సహకార సంఘ డైరెక్టర్లుగా ఎన్నికైన సందర్భంగా శనివారం వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లకు శాలువాలు కప్పి. సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామానికి చెందిన వారు సొసైటీ డైరెక్టర్లుగా ఎన్నిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ధికి, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ, రైతులకు అందుబాటులో ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.