telangana
శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ ఆలయ వార్షిక మహోత్సవం
సూర్య రెంజల్ : శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవం సందర్భంగా మహా యజ్ఞ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు.మండల కేంద్రంలో గ్రామ దేవత అయినటువంటి శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ అమ్మవారికి శనివారం ఉదయం నుండి అభిషేకాలు, పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మహా యజ్ఞం హోమ కార్యక్రమాన్ని చేపట్టారు. యజ్ఞ హోమం కార్యక్రమాన్ని నిర్వహించి పూర్ణాహుతి తో సమాప్తం చేపట్టారు. డిసెంబర్ 6వ తేదీన అమ్మవారికి బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీని నిర్వాకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, సభ్యులు, దంపతులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.