BREAKING
పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ

అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం
 
 
 
 సూర్య కామారెడ్డిజిల్లా ప్రతినిధి ,''జిల్లాలో ఆటో రిక్షాల ద్వారా ప్రయాణించే విద్యార్థుల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని, జిల్లా రవాణా అధికారి  సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు ఆటో రిక్షాల పై విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ తనిఖీల సందర్భంగా కామారెడ్డి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా, పరిమితి కి మించి పిల్లల తో నడుస్తున్న పలు వాహనాలను గుర్తించారు. సహాయక మోటార్ వెహికిల్స్ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ కుమార్, కృష్ణ తేజ గారు సంబంధిత వాహనాలపై గత మూడు రోజులుగా చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారులు  మాట్లాడుతూ, విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షితమైన మరియు అనుమతులున్న వాహనాలలోనే ప్రయాణిస్తున్నారా అన్న విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అలాగే రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ రవాణా శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మోటార్ వాహన చట్టం ప్రకారం ఈ రూల్స్ పాటించవలెను
ఒక 4 సీటర్ ఆటో రిక్షా లో ఆరుగురు పిల్లలు (12 సంవత్సరాల కంటే తక్కువ) మాత్రమే పరిమితి మోటార్ వెహికల్ చట్టం ప్రకారం విధించబడింది. స్కూల్ పిల్లల బ్యాగ్ లు బండి బయటకి రాకుండా బండి లోపల సర్దుబాటు చేయాలి. సేఫ్టీ గ్రిల్స్ విధిగా బిగించి సురక్షితముగా తీసుకెళ్లవలెను. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.