కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు
హనుమకొండ, మేజర్ న్యూస్, కాళోజీ కళాక్షేత్రంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక, కళా సంస్థల కార్యక్రమాలకు వేదికగా ఉపయోగపడే విధంగా అనువైన స్థలాన్ని గుర్తించినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు
శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్రంలోని ఆడిటోరియం, ఇతర విభాగాలను క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే,కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ
కాళోజి ఫౌండేషన్ ప్రతినిధుల సలహా మేరకు150 నుండి 200 మంది వరకు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనువైన స్థలాన్ని గుర్తించామన్నారు
కళాక్షేత్రంలో ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలిచే విధంగా అనువైన స్థలాన్ని గుర్తించినట్లు, ఇందుకు సంబందించిన ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కుడా సీపీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, కాళోజి ఫౌండేషన్ ప్రతినిధులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, రామశాస్త్రి, విద్యార్థి, పొట్లపల్లి
శ్రీనివాస్ రావు ,ఇతర అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్; రమేష్, హనుమకొండ, హనుమకొండ జిల్లా