సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షపై అవగాహన -విశ్వం మాక్ టెస్ట్ కు విశేష స్పందన
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షపై విద్యార్థుల తల్లిదండ్రులకు వరదరాజు నగర్ లోని విశ్వం సైనిక్ నవోదయ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం జరిగిన కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించి మాక్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, మాక్ టెస్ట్ ద్వారా విద్యార్థుల ప్రస్తుత విద్యా సామర్థ్యం, సమయపాలన, ప్రశ్నలను అర్థం చేసుకునే నైపుణ్యం, పరీక్షా విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశ్వం విద్యాసంస్థల అధినేత డా.ఎన్.విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, భవిష్యత్తులో రక్షణ రంగంలో ఉన్నత అవకాశాలకు పునాది వేస్తుందని తెలిపారు.
2027-28 ఏడాదికి 6వ, 9వ తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష జనవరి 31 జరుగుతుందని, అర్హులైన విద్యార్థులు డిసెంబర్ రెండో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హతలు, వయోపరిమితి, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, పరీక్షా సరళి, సిలబస్, ముఖ్యమైన సూచనలు, పరీక్షకు సిద్ధమయ్యే విధానం వంటి అంశాలను వివరించారు. మాక్ టెస్ట్ అనంతరం విద్యార్థులు సాధించిన ఫలితాలను విశ్లేషించి, వారి బలాలు, మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై తగిన సూచనలు అందించారు. ఇటువంటి మాక్ టెస్టుల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అసలు పరీక్షలో సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని వివరించారు.
గత 37 సంవత్సరాలుగా విశ్వం విద్యాసంస్థలు విద్యారంగంలో అందిస్తున్న సేవలను ప్రస్తావిస్తూ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, ప్రత్యేక శిక్షణ, నిరంతర మాక్ టెస్టులు, వ్యక్తిగత పర్యవేక్షణతో విద్యార్థులను జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు తీర్చిదిద్దుతున్నట్లు డా. విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. 2026 ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థాయిలో విశ్వం విద్యార్థులు ప్రథమ ర్యాంకులు సాధించడంతో పాటు, 69 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశాలకు అర్హత సాధించడం సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. అదేవిధంగా, 2026 నవోదయ ప్రవేశ పరీక్షల్లో విశ్వం విద్యార్థులు జాతీయ స్థాయిలో రెండవ అత్యుత్తమ మార్కులు సాధించడంతో పాటు 72 సీట్లు సాధించడం విశేషమన్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించాలంటే ముందస్తు ప్రణాళిక, నిరంతర సాధన, క్రమశిక్షణతో కూడిన అధ్యయనం, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని సూచించారు. పాల్గొన్న తల్లిదండ్రులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మరిన్ని వివరాలకు వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్, నవోదయ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ 8688888802, 9399976999 నంబర్లను సంప్రదించాలన్నారు
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్