ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా పూజా క్రతువులు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు, అర్చనలు చేపట్టారు. సహస్ర దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసంలో విశేష ప్రాధాన్యత కలిగిన ఈ పూజా కార్యక్రమాలను భక్తులు భక్తిభావంతో వీక్షించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు పద్మావతి ఠాకూర్, సరిత, రాఘవరాజు, ఏ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.