BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

ఎన్నికల సామగ్రి భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : కమిషనర్ ధ్యానచంద్ర

Select Suryaa Now
ఎన్నికల సామగ్రి భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026కు సంబంధించిన ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి పటమట ఇండోర్ స్టేడియంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల సామగ్రిని భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌గా ఎంపిక చేసిన ఇండోర్ స్టేడియంలోని వసతులు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలకు వినియోగించిన సామగ్రిని భద్రపరిచేందుకు పటమట ఇండోర్ స్టేడియంను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్ర లయోలా కళాశాల స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న ఎన్నికల సామగ్రిని పటమట ఇండోర్ స్టేడియానికి సురక్షితంగా తరలించి భద్రపరిచే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సామగ్రి తరలింపు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్ట్రాంగ్ రూమ్‌లో భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజనీర్ చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, కార్యనిర్వాహక ఇంజనీర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.