భక్త కనకదాస జీవితం ఆదర్శనీయం: కలెక్టర్
మచిలీపట్నం, మేజర్ న్యూస్: భక్త కనకదాస జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ భక్త కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామధ్యాన చరిత్ర, మోహన తరంగిణి వంటి ప్రముఖ రచనలతో భక్త కనకదాస సాహిత్య రంగంలో విశేష గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన జీవితంలోని ఆదర్శాలు, భక్తి భావం, సామాజిక సందేశాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్ఓ కె.శ్రీధర్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.రమేష్ తదితరులు పాల్గొని భక్త కనకదాసకు నివాళులర్పించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.