BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం

Select Suryaa Now
గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం

పెనమలూరు, మేజర్ న్యూస్: కంకిపాడు మండలంలోని పునాదిపాడు, మారేడుమాక, మంతెన, తెన్నేరు గ్రామాల్లో కూటమి బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల తరఫున పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. గతంలో తమ హయాంలో కోట్లాది రూపాయల నిధులతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, గంగానమ్మ గుడి రోడ్డు, కొత్త కాలనీల రోడ్లు, పునాదిపాడు–గుడివాడ ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. గత ఐదేళ్లలో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. అభివృద్ధి గురించి గొప్పలు చెప్పడం కాకుండా గ్రామాలకు చేసిన పనులను వివరించాలని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రెండేళ్లలో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలను పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కుల, మత, వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా గ్రామాల భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.