కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పణ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: విజయవాడ గవర్నర్‌పేటకు చెందిన మామిడి వీర వెంకట సత్యనారాయణ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళంగా సమర్పించారు. ఈ విరాళాన్ని ఆలయ అధికారుల ఆధ్వర్యంలో, ఆలయ అర్చక స్వాముల సమక్షంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహకారం అందించిన దాతను ఆలయ అధికారులు అభినందించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.