BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వ్యాధులను నివారించాలి

Select Suryaa Now
ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వ్యాధులను నివారించాలి

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగరంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం రామకృష్ణపురం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కాలువల్లో పూడిక, గుర్రపుడెక్కలు, చెత్త తొలగింపుతో పాటు డ్రోన్ల ద్వారా ఎంఎల్ ఆయిల్ పిచికారీ, ఫాగింగ్, లార్వా నివారణ మందుల పిచికారీ చేపడుతున్నామని తెలిపారు. నీటి వనరుల్లో గాంబూసియా చేపలను విడిచిపెట్టి దోమల లార్వా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రజలు ప్రతి శుక్రవారం ఇళ్లలో, డాబాలపై, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే బకెట్లు, డ్రమ్ములు, పూల కుండీలు, టైర్లు, కూలర్లు, ఫ్రిజ్ ట్రేలను శుభ్రం చేసి నీటిని తొలగించాలని సూచించారు. ఐదు నుంచి ఏడు రోజుల పాటు నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 76వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరాజు గాదిరాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ సాంబ శివరాజు, హెల్త్ అసిస్టెంట్ నీరజ, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.