BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

కృష్ణా జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ

Select Suryaa Now
కృష్ణా జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ

మచిలీపట్నం, మేజర్ న్యూస్: అంతర్జాతీయ బాల్య, ప్రారంభ, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 27న కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విమల, మచిలీపట్నం డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సువార్త, డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చెందిన డాక్టర్ నిరీక్షణ, గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సీతా మహాలక్ష్మి, మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కృష్ణా జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల బాధిత బాలికలకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా రక్షణ, విద్య, కౌన్సెలింగ్ అందిస్తామని తెలిపారు. ప్రతి బాలిక చదువును కొనసాగించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థాయి అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాల సమాచారం అందితే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని కోరారు. అనంతరం అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి బాల్య వివాహాల నివారణపై నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే 1098, 112 లేదా వాసవ్య మహిళా మండలి హెల్ప్‌లైన్ 7702737964కు తెలియజేయాలని అధికారులు కోరారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.