BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

తోట్లవల్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Select Suryaa Now
తోట్లవల్లూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఉయ్యూరు, మేజర్ న్యూస్: తోట్లవల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూముల రికార్డుల పునఃపరిశీలన ప్రక్రియతో పాటు రెవెన్యూ రికార్డులు, పెండింగ్ దరఖాస్తులు, కార్యాలయ పరిపాలనా వ్యవహారాలను పరిశీలించారు. భూముల రికార్డుల పునఃపరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అందుబాటులో ఉన్న రికార్డులు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా విచారించి స్పష్టమైన కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు రికార్డుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించాలని తెలిపారు. ఈ తనిఖీలో ఉయ్యూరు ఆర్డీఓ కరుణకుమారి, తోట్లవల్లూరు తహసీల్దార్ కుసుమకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.