BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

రెండో దశ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Select Suryaa Now
రెండో దశ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

మచిలీపట్నం, మేజర్ న్యూస్: రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. ఈనెల 29న ఉయ్యూరు డివిజన్‌లో జరగనున్న ఎన్నికల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పెండింగ్ ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని, పోలింగ్, కౌంటింగ్ సామగ్రిని తనిఖీ చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, అభ్యర్థుల జాబితాలు సరిచూసుకోవాలని, 200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాల్లో అదనపు ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్ష సూచన నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను వీలైనంత వరకు ఇండోర్‌లో నిర్వహించాలని, పోలింగ్ సిబ్బందికి భోజన, రవాణా సదుపాయాలు కల్పించాలని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమారు 200 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విధులకు గైర్హాజరైన 280 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, వివరణ సంతృప్తికరంగా లేకుంటే సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 29వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసిన వెంటనే 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన టేబుళ్లు, సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు. పోలింగ్ శాతం, విజేతల వివరాలను సంబంధిత యాప్‌లు, స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని, అనివార్య పరిస్థితుల్లో 30వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఐడీ కార్డులు, రెమ్యూనరేషన్ ముందుగానే సిద్ధం చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ కే.శ్రీధర్ రెడ్డి, డీపీఓ ఎం.ధనలక్ష్మి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.