BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

మచిలీపట్నం, మేజర్ న్యూస్: గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన సిబ్బంది తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా తొట్లవల్లూరు, పెనమలూరు, కంకిపాడు మండలాలతో పాటు ఉయ్యూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. తొట్లవల్లూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పరిశీలించి ఎన్నికల సిబ్బందికి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెనమలూరు మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ల జారీ, ఓటు వినియోగం, సందేహాల నివృత్తికి ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు, ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు. కంకిపాడు మండల పరిషత్ కార్యాలయం, ఉయ్యూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ జారీ నుంచి ఓటు వేసి బ్యాలెట్ బాక్స్‌లో వేయడం వరకు ప్రతి దశలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.