BREAKING
ముగిసిన రెండో విడత ప్రసారం కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు

Select Suryaa Now
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు
సూర్య, సెంటినరీకాలనీ  :అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంథని నియోజకవర్గం రామగిరి మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బొడ్డు శ్రీవైష్ణవికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండగా నిలిచారు. వైష్ణవి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2,50,000 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరు చేయించారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబును కోరగా, ఆయన వెంటనే స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీని వైష్ణవి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వైష్ణవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి చూపిన చొరవ తమ కుటుంబానికి ఎంతో భరోసానిచ్చిందని పేర్కొన్నారు.