BREAKING
సీసీ కెమెరాలతో 30 నిమిషాల్లో ఆటో గుర్తింపు.. పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పణ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస ప్రత్యేక పూజలు ఎన్నికల సామగ్రి భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : కమిషనర్ ధ్యానచంద్ర ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వ్యాధులను నివారించాలి విజయవాడ మెట్రోకు పటిష్ట హెచ్‌ఆర్ ప్రణాళిక కనకదాస జయంతి సందర్భంగా ఘన నివాళులు గన్నవరం ఎన్నికల ఫలితాలపై వాస్తవాలు వక్రీకరించొద్దు.. : యార్లగడ్డ వెంకట్రావు అయ్యప్ప భజనలతో ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యత ఓటు లెక్కింపులో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముగిసిన రెండో విడత ప్రసారం కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం

ముగిసిన రెండో విడత ప్రసారం

Select Suryaa Now
ముగిసిన రెండో విడత ప్రసారం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పు గోదావరి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగింపునకు 44 గంటల ముందుగానే ప్రచార నిషేధం అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచే ప్రచార నిషేధ కాలం ప్రారంభమైనట్లు ఆమె వెల్లడించారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకుల ద్వారా ప్రచారం చేయడం, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర కార్యకలాపాలకు పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపారు. ప్రచార నిషేధ సమయంలో అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బహుమతులు లేదా ఇతర వస్తువులు పంపిణీ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాలు, ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు నియమించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు.