BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

కనకదాస జయంతి సందర్భంగా ఘన నివాళులు

Select Suryaa Now
కనకదాస జయంతి సందర్భంగా ఘన నివాళులు

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : సెయింట్ కనకదాస జయంతిని పురస్కరించుకుని శుక్రవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వంగవీటి రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్ చన్నుపాటి కాంతిశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనకదాస గొప్ప భక్తుడు, కవి, తత్వవేత్తగా సమాజానికి విశేష సేవలందించారని కొనియాడారు. తన రచనలు, కీర్తనల ద్వారా భక్తి, మానవత్వం, సమానత్వం, సామాజిక సామరస్య సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు. కులమత భేదాలకు అతీతంగా మానవులందరూ సమానమేనని తన బోధనల ద్వారా చాటిచెప్పారని తెలిపారు. ఆయన అందించిన సాహిత్య, ఆధ్యాత్మిక సేవలు నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శకుంతల, చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, ఎస్‌ఈ చంద్రశేఖర్, డీడీహెచ్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ ప్రభావతి, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.