BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

అయ్యప్ప భజనలతో ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యత

Select Suryaa Now
అయ్యప్ప భజనలతో ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యత

విజయవాడ పశ్చిమ, మేజర్ న్యూస్: అయ్యప్ప స్వామి భజనలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యతా భావాన్ని బలోపేతం చేస్తాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ దూదిపేట సందులో 49వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి భజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వకర్మ నాయకుడు పట్నాల హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌తో కలిసి హాజరైన ఎంపీ, అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి భజనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష కేవలం ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదని, క్రమశిక్షణ, నిష్ఠ, సహనం, సేవాభావం, సమానత్వం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించాలనే సందేశాన్ని అయ్యప్ప స్వామి ఆరాధన అందిస్తుందని తెలిపారు. భజనలు, పూజలు మనసుకు ప్రశాంతత కలిగించడమే కాకుండా కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలను ఒకచోట చేర్చి సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. పూర్వీకులు అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. విజయవాడలో అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో, పరస్పర గౌరవంతో కలిసి మెలిసి ఉండాలని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 49వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన పట్నాల హరిబాబు, నిర్వాహకులు, అయ్యప్ప భక్తులు, స్థానిక పెద్దలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు కొలగాని అశోక్, ఈగల సాంబ, టీడీపీ నాయకులు కుంచన దుర్గారావు, ఇమ్రాన్, హరి మాణిక్యం, స్థానిక నాయకులు, అయ్యప్ప స్వామి భక్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.