14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ
వాక్సినేషన్ ఉపయోగాలు తెలిపిన డాక్టర్ ప్రశాంతి
నర్సీపట్నం నవంబరు 27 మేజర్ న్యూస్ : నర్సీపట్నంలోని ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (Deputy DM&HO) కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం డాక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో వేములపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మరియు సిబ్బంది ఆధ్వర్యంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నం డిప్యూటీ డీఎంహెచి డాక్టర్ జే. ప్రశాంతి స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జే. ప్రశాంతి మాట్లాడుతూ బాలికలకు పలు సూచనలు చేశారు తెలియజేశారు:
వ్యాక్సిన్ ఆవశ్యకత: భవిష్యత్తులో స్త్రీలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకకుండా నిరోధించడానికి ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకం. అసురక్షిత లైంగిక కార్యకలాపాల ద్వారా హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్ పి వి సంక్రమించి ఈ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తగా ఈ టీకా ఇవ్వడం జరుగుతోంది.
అర్హులు & లభ్యత: 14 సంవత్సరాలు నిండి, 15 సంవత్సరాలు పూర్తికాని బాలికలకు ఈ హెచ్పివి వ్యాక్సిన్ను ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచితంగా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా అందుబాటులో ఉంది.
విజయవంతంగా అమలు: మన దేశంలో ఇప్పటివరకు కోటి మందికి పైగా ఈ వ్యాక్సిన్ను వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు 100% లక్ష్యాన్ని సాధించగా, అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి కావడం గర్వకారణం. మన అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 13,469 మంది బాలికలు ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ప్రారంభ నేపథ్యం: నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి గౌరవ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
అర్హులైన బాలికల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమీపంలోని పీహెచ్సీ లేదా యూపీహెచ్సీలలో తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలని డాక్టర్ జే. ప్రశాంతి నర్సీపట్నంలోని ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరారు.