వెంకటాపురం గ్రామ సర్పంచ్ బుధిత్ బుడితీ రమణమ్మ.గౌరీ నాయుడులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
సీతానగరం నవంబర్ 27 మేజర్ న్యూస్....మండలం వెంకటాపురం (కామందొర వలస) పంచాయతీ ఎన్నికల్లో సమిష్టి కృషితో విజయకేతనం ఎగురవేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుడితి గౌరీ నాయుడు శ్రీమతి రమణమ్మ సర్పంచ్ గా విజయం సాధించిన శుభ సందర్భంగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుని క్యాంప్ కార్యాలయంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి గౌరవపూర్వకంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అందరూ కలిసి కట్టుగా కష్టపడి గ్రామంలో విజయాన్ని సాధించి పార్టీ గౌరవాన్ని పెంపొందించారూ అని అందరినీ ఆయన అభినందించడం జరిగినది. ఇలానే పంచాయతీలో మన వారి అందరూ కలిసి కట్టుగా ఉండి పనిచేయాలని, గ్రామాలను అభివృద్ధిపథంలో నడుపుతూ పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని అందరికీ పిలువు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుడితి ముకుందా, మండల కార్యదర్శి ఎగిరెడ్డి గోపాల నాయుడు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.