BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి

Select Suryaa Now
ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి

 

శ్రీకాకుళం-మేజర్ న్యూస్ ప్రతినిధి:
అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల (ఎన్‌సీడీసీడీ) వార్షిక పరీక్షల్లో నేర్చుకున్న మెలకువలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ వైద్యాధికారులకు ఆదేశించారు. తన కార్యాలయంలో శుక్రవారం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు నిర్వహించిన వ్యాధుల నిర్ధారణ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ శిక్షణ ద్వారా డాక్టర్ల నైపుణ్యాలను పెంపొందించి, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కె. శివరంజని ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల పీహెచ్‌సీ డాక్టర్, ముఖ్య శిక్షకురాలు ఉషశ్రీ వ్యాధుల నిర్ధారణ పద్ధతులు, కార్యాచరణపై వివరించారు. శిక్షకుడు ఎస్. వెంకటేశ్వర్ రెడ్డి గుండె పరీక్ష నిర్వహణ, నివేదికల పరిశీలనపై శిక్షణ ఇవ్వగా, జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ సుజాత పాముకాటు, కుక్కకాటు నివారణ జాగ్రత్తలు, సకాలంలో అందించాల్సిన అత్యవసర చికిత్సపై అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.