సూర్య, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందినటువంటి వోడ్నాల మల్లేశం తల్లి అయిన వోడ్నాల లక్ష్మి ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందడం తో వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేనందున రాఘవపట్నం &గంగాదేవిపల్లి గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు యువకులు, ప్రజలు దయా హృదయం తో తోచిన విధంగా ఆర్థిక సహాయం మొత్తం 27500అక్షరాలా ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు వారి కుటుంబం కి ఆ ర్జీ పీ సేవా సమితి ద్వారా అందచేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడo జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్లు కాసారపు అరవింద్ గౌడ్, బుర్ర తిరుపతి గౌడ్, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి మధుకర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వోడ్నాల అంజయ్య, పద్మశాలి సంఘము అధ్యక్షులు వెంగలదాస్ మల్లేశం, ప్రధాన కార్యదర్శి అంకం గణేష్,కొలిపాక నారాయణ, రత్నాకర్ ఆడెపు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.