గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి
గరుగుబిల్లి, నవంబర్ 27, మేజర్ న్యూస్:గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన మరడాన ఉషారాణి మరియు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్ర మం గ్రామ సచివాలయo ఆవరణలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఎన్నికల అధికారి సమక్షంలో నూతన సర్పంచ్ మరడాన ఉషారాణితో పాటు ఎన్నికైన వార్డు సభ్యులు మరడాన లక్ష్మి, మండల శంకర్రావు, గుంట్రెడ్డి కూర్మారావు, మరడాన వెంకటనాయు డు, మూడడ్ల పకీరునాయుడు, మారడాన సుశీలమ్మ, మండల స్వప్న, బేత సుశీల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.ఈసంద ర్భంగా సర్పంచ్ మరడాన ఉషారాణి మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన గిజబ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.పార్టీలకతీతంగా అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, మౌలిక వసతుల కల్పనకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేయడానికి కృషి చేస్తామని పేర్కొ న్నారు.ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ మరడాన కృష్ణమునాయుడు,గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది మరి యు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.