BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

Select Suryaa Now
తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి
సూర్య గంగాధర ;తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నవంబర్ 29, 2009 ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన మలుపు అని, ఆ దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ఉద్యమాన్ని ఒక నిర్ణయాత్మక దశకు తీసుకెళ్లిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.ఈ నెల 29న అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ గంగాధర మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాన్ని నేటి యువతకు, రాబోయే తరాలకు వివరించాల్సిన బాధ్యత ఉద్యమకారులపై ఉందని పేర్కొన్నారు.
. *దీక్షా దివస్ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. ఉద్యమ చరిత్రను మనమే ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ ఎందుకు వచ్చింది, రాష్ట్ర సాధన కోసం ఎవరు పోరాడారు, ఎవరు త్యాగాలు చేశారు అనే విషయాలను ప్రజలకు నిరంతరం చెప్పుకోవాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధనలో పాత్ర లేని వారు కూడా తామే తెలంగాణ తెచ్చామని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని  అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం మన బాధ్యత. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలుసుకుని, ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలని . ఈ నెల 29న అలుగునూరులో జరిగే దీక్షా దివస్ సభకు యువత పెద్ద సంఖ్యలో తరలిరండి. సభను విజయవంతం చేయండి అని ఆయన పిలుపునిచ్చారు.ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పార్టీ మండల్ అధ్యక్షులు నవీన్ రావు,కొండయ్య, జితేందర్రెడ్డి,శ్రీనివాస్,వెంకటేష్ పార్టీ సీనియర్ నాయకులు నాగి శేఖర్,మధుసూదన్ రెడ్డి,చుక్క రెడ్డి, విజేంద్రరెడ్డి,మధు,మాధవ్,తిరుపతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .