telangana
దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలి
సూర్య, తంగళ్ళపల్లి: ఈనెల 29న కరీంనగర్లో చేపట్టే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న తో కలిసి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. కెసిఆర్ చేసిన దీక్ష ప్రతి ఒక్క యువకునికి తెలిసేలా చేయాలన్నారు. కెసిఆర్ వల్లనే తెలంగాణ సిద్ధించిందని స్పష్టం చేశారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూర్మాని రాజశేఖర్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, పడిగెల మానస రాజు, అంకారపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.