BREAKING
గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పోలీసుల పనితీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా ! ఏటవాకిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మోపురి మోహన్ ! ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), రాజమహేంద్రవరంలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్మికులతో మేయర్ రమేష్ గౌడ్ ఆత్మీయ ముచ్చట్లు ఓటీటీలోకి వస్తున్న రూ.450 కోట్ల బ్లాక్‌బస్టర్ హనుమాన్ అన్ష్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష

Select Suryaa Now
 ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష
హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డితో పాటు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో వారం రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఓ భూ వివాదానికి సంబంధించి పిటిషనర్‌కు తగిన పోలీస్ రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, పోలీసు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ శిక్షను ఖరారు చేసింది.

అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా జైలు శిక్ష అమలును వారం రోజుల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది. వారం రోజుల్లోగా డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు తెచ్చుకోకపోతే, హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.