అంబేద్కర్‌కు ఘన నివాళి
నవాబుపేట సూర్య న్యూస్:భారత రాజ్యాంగ దినోత్సవం(సంవిధాన్ దివస్),జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులు,సమానత్వం,స్వేచ్ఛ,సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి,బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ,నాయకులు ఆంజనేయులు,శ్రీనివాస్,గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు.