*జగదేవ్‌పూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ పీఠిక పఠనం*
సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మచ్చా గణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగంలోని ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని వాటిని గౌరవించాలని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.