నూతన డీఆర్‌డీఓ పీడీకి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా నుంచి బదిలీపై వచ్చి వికారాబాద్ జిల్లా డీఆర్‌డీఓ పీడీగా బాధ్యతలు స్వీకరించిన బి. నర్సింగరావు గురువారం హైదరాబాద్‌లోని చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి అభివాదం తెలిపారు. నూతన బాధ్యతల స్వీకరణ వివరాలను చీఫ్ విప్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన నర్సింగరావుకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనతో పాటు వికారాబాద్ జిల్లా అభివృద్ధికి సమర్థవంతంగా కృషి చేయాలని సూచించారు.