గుండెపోటుతో మాజీ ఉపసర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ హఠాన్మరణం
కందుకూరు, మేజర్ న్యూస్: కందుకూరు మండలం మాదాపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకుడు ముద్ద గౌని శ్రీకాంత్ గౌడ్ (32) గుండెపోటుతో బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు. రాత్రి 9 గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఇంట్లో కుప్పకూలగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీకాంత్ గౌడ్‌కు రెండేళ్ల కుమారుడు ఉండడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల గ్రామస్థులు, బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా.