వికలాంగ ఓటరికి సహాయం.. పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించిన పోలీసులు
శెట్టిపల్లి పోలింగ్ కేంద్రంలో పోలీసుల సేవాభావం
గుడిపల్లి మేజర్ న్యూస్:-ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్య హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా పోలీసులు సేవాభావంతో వ్యవహరించారు. శెట్టిపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన వికలాంగ ఓటరికి పోలీసులు సహాయం అందించి, వీల్‌చైర్‌లో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేసేలా సహకరించారు.
శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఆయన సంకల్పానికి పోలీసులు అండగా నిలిచారు. వీల్‌చైర్‌లో ఉన్న ఓటరిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి, ఓటు వేసిన అనంతరం తిరిగి బయటకు తీసుకువచ్చారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు చూపిన మానవత్వం, సేవాభావం పలువురి ప్రశంసలు అందుకుంది.
ప్రతి ఓటు విలువైనదేనని, శారీరక ఇబ్బందులు ఉన్నవారికి సైతం ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించడం పోలీసుల బాధ్యతతో పాటు మానవత్వానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.
సూర్య రిపోర్టర్:లెనిన్ బాబు గుడిపల్లి మండలం