టీడీపీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి
మాకవరపాలెం, నవంబరు 26,మేజర్ న్యూస్:
గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ తరఫున సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి ప్రజలు సహకరించాలని జడ్పీటీసీ అల్లు రామునాయుడు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని బుచ్చన్నపాలెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత ఎన్నికల్లో 95 శాతం స్థానాల్లో కూటమి విజయం సాధించిందని గుర్తుచేశారు. మండలంలో ఇప్పటికే రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మరో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందన్నారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమం కోసం టీడీపీ అభ్యర్థులకు మద్దతు పలకాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి రుత్తల రమణమ్మ, టీడీపీ గ్రామ అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.