BREAKING
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం

మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు:

Select Suryaa Now
మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు:

 ఓటర్లకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు

​డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

​కోటబొమ్మాళి, నవంబర్ 25, మేజర్ న్యూస్: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, గురువారం జరగనున్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లంతా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే కీలకమని, ప్రతి ఓటు స్థానిక ప్రాంత భవిష్యత్తును నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మౌలిక వసతుల కల్పన, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.

​నిర్భయంగా ఓటు వేసి స్థానిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

​గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ధి చెందిన గ్రామాలు మరియు పట్టణాలే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాదులని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోరారు. శ్రీకాకుళం నగర అభివృద్ధికి, మెరుగైన మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను ప్రజలు తమ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎన్నుకోవాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.