BREAKING
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం

డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం!

Select Suryaa Now
డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం!

అరకులోయ, నవంబర్ 25, మేజర్ న్యూస్:
గిరిజన ప్రాంతంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) (ఆదివాసీ గిరిజన మహిళ సంఘం)అల్లూరి సీతారామరాజు జిల్లా గౌరవ అధ్యక్షురాలు వి.వి.జయ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మహిళల హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అరకులోయ ప్రభుత్వ నివాసానుబంధ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఆర్ ఐ టి ఐ)లో బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఆదివాసీ గిరిజన మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో వి.వి.జయ మాట్లాడుతూ ఐద్వా ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీ వరకు వరుసగా 16 రోజుల పాటు నిరంతర ప్రచార,పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు మద్యం,డ్రగ్స్ రహిత ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు,యువత, మేధావులు చేయి చేయి కలిపి ముందుకు రావాలని ఆమె కోరారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసలు, వివక్షలకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.స్త్రీలను పురుషులతో సమానంగా గౌరవించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు.విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా దేశ స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసి వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె సూచించారు.సామాజిక, రాజకీయ అంశాలపై లోతైన అవగాహన పెంచుకొని సమాజంలో జరిగే అన్యాయాలను ధైర్యంగా ప్రశ్నిస్తూ పరిష్కార దిశగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.వ్యాపార సంస్కృతి,పితృస్వామ్య భావజాలమే హింసకు మూలమన్నారు.మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టికాదోయ్,దేశమంటే మనుషులోయ్ అనే సూక్తిని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ సొంత లాభం కొంత మానుకొని తోటి మనుషుల కోసం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని ఆమె కోరారు.దేశంలో మహిళలపై రోజురోజుకు గృహహింస, అత్యాచారాలు,వేధింపులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయని వి.వి. జయ ఆవేదన వ్యక్తం చేశారు.ఈసదస్సును ఉద్దేశించి స్థానిక ఆర్ ఐ టి ఐ ప్రిన్సిపాల్ వై. ఉమాశంకర్ మాట్లాడుతూ స్థానిక ఆర్ ఐటీఐలో సాంకేతిక విద్యతో పాటు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో, ఉన్నతమైన ఆలోచనలతో విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ప్రస్తుత తరుణంలో యువత మద్యం,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కళాశాల యాజమాన్యం, సిబ్బంది ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.​ఈ సదస్సులో మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కిల్లో. శశికళ,జిల్లా కమిటీ సభ్యులు జి.సన్యాసమ్మ, స్థానిక ఆర్ ఐటీఐ నిర్వాహకులు ఎస్.వి.రమణ,జి.చిరంజీవి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.