BREAKING
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం

నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం!

Select Suryaa Now
నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం!

లక్కవరపుకోట, నవంబర్ 25 (మేజర్ న్యూస్): మండలంలో నేడు సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏ గ్రామ పంచాయతీ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా ఎల్.కోట మేజర్ పంచాయతీ, గొల్జాం, చందులూరు, కొట్యాడ, శ్రీరాంపురం, మల్లివీడు, వెల్లిగౌరంపేట, జమ్మాదేవిపేట తదితర గ్రామాల్లో హోరాహోరీ పోరు నెలకొంది.
గొల్జాం, శ్రీరాంపురం గ్రామాల్లో నలుగురు అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. జనాభా పరంగా, గ్రామ ప్రాధాన్యత పరంగా కీలకమైన ఈ పంచాయతీల్లో సర్పంచ్‌గా ఎన్నిక కావాలనే ఆశతో అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. చివరి రోజు వరకు పోటాపోటీ ప్రచారాలు, ఎత్తుకు పైఎత్తులు, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు సాగాయి.
అభ్యర్థులు తమదైన వ్యూహాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించగా, కొన్ని గ్రామాల్లో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలు, బంధుప్రీతి, కుల సమీకరణాలు ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారంలో హామీలు, వాగ్దానాలు గుప్పించిన అభ్యర్థుల భవితవ్యం నేడు ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది.
ప్రజాస్వామ్య విలువలపై ఆందోళన......
ప్రస్తుత ఎన్నికల తీరు చూస్తుంటే స్వచ్ఛమైన రాజకీయాలు కనుమరుగవుతున్నాయనే ఆవేదన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. సంక్షేమం, గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, నీతి నియమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఎన్నికల్లో డబ్బు, ప్రలోభాలు, కుల, మత సమీకరణాలు ప్రధాన పాత్ర పోషించడం ఆందోళన కలిగించే పరిణామమని అభిప్రాయపడుతున్నారు.
ప్రలోభాలకు ఓటర్లు లొంగిపోవడం, రాజకీయ నాయకులు సైతం అదే మార్గాన్ని అనుసరించడం ప్రజాస్వామ్య విలువలను బలహీనపరుస్తోందని, ఈ పరిస్థితులు భవిష్యత్ తరాల రాజకీయాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గ్రామాభివృద్ధి, మంచి పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం కంటే ప్రలోభాలు, వ్యక్తిగత సమీకరణాలకే ప్రాధాన్యత పెరుగుతున్న తీరు బాధాకరమని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? గ్రామ ప్రథమ పౌరుడిగా ఎవరు ఎన్నికవుతారు? సర్పంచ్ పీఠం ఎవరిని వరిస్తుంది? అన్నది తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.అయితే ప్రలోబాల కి ఓటరు లొంగి పోయి ఓటు వేస్తే రేపు గెలిచిన వారిని ప్రశ్నించే హక్కు పోయినట్టే కదా...