BREAKING
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం

బెదిరింపులకు భయపడొద్దు..!

Select Suryaa Now
బెదిరింపులకు భయపడొద్దు..!


- జన సైనికులకు అండగా ఉంటాం.

- నియోజకవర్గ ఇంచార్జ్  బలగ ప్రవీణ్ కుమార్.

నరసన్నపేట నవంబర్ 25 మేజర్ న్యూస్ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యారబాడు గ్రామపంచాయతీలో జనసేన కార్యకర్తలు, మద్దతుదారులను కొందరు వ్యక్తులు కమ్యూనిటీ పేరుతో బెదిరింపులకు గురిచేస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని జనసేన నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన రాజకీయ సిద్ధాంతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ, హక్కు ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు నరసన్నపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బలగ ప్రవీణ్ కుమార్ మంగళవారం యారబాడు గ్రామపంచాయతీని సందర్శించారు. కార్యకర్తలు, మద్దతుదారులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం కుల, వర్గాల పేరుతో బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

ఏ ఒక్క జనసైనికుడికి ఇబ్బంది కలిగినా, ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా పార్టీ నాయకత్వం పూర్తిస్థాయిలో అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులకు ఎవరూ భయపడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పూతి రమణ, ఎన్ని శ్రీధర్, సత్య, శేఖర్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.