కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక
*మెట్టూరు బిట్ 1,మెట్టూరు బిట్ 3 , జనసేన లో చేరిక.
*మెట్టూరు బిట్ 1లో వైసీపీ నుండి జనసేన లోనికి, మెట్టూరు బిట్ 3లో దేశం పార్టీ నుండి జనసేన లోనికి భారీ ఎత్తున చేరిక.
కొత్తూరు నవంబర్ 25(మేజర్ న్యూస్ ) కొత్తూరు మండలం లో పంచాయతీ ఎన్నికలు ముందు తెలుగుదేశం పార్టీ కి భారీ ఎత్తున దెబ్బ తగిలింది .అదేవిధంగా మెట్టూరు బిట్ వన్ లో వైసీపీ మరో దెబ్బ తగిలింది. ఈ రెండు ప్రధాన పార్టీల నుండి ఒకే రోజు జడ్ పి చైర్ పర్సన్ కొరికాన భవాని,సుడా చైర్మన్ రవికుమార్ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం తీసుకొన్నారు. మెట్టూరు బిట్ వన్ పరిది లో సంకిలి నిర్వాసితులు జనసేన పార్టీ కండువా కప్పుకొన్నారు.వీరి చేరిక ప్రభావం తో సుమారు నూటా యాభై ఓట్లు వరకు
ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అదేవిధంగా మెట్టూరు బిట్ 3 మాజీ సర్పంచ్ కోయిలాపు శ్రీనివాసరావు వర్గామంతా సుమారు రెండు వందలు కుటుంబాలకు పైగా కొరికాన దంపతులు సమక్షంలో దేశం పార్టీ విడచి జనసేన తీర్ధం పుచ్చుకొన్నారు. ఈ చేరికలు పంచాయతీ ఎన్నికల్లో జరగడం తో ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.