BREAKING
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం

అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత

Select Suryaa Now
అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత

  ఆరిలోవ, మేజర్ న్యూస్ : జీవీఎంసీ, 17వ వార్డు   పరిధిలో గల సంజయ్ గాంధీ కాలనీ  శ్రీ పోలమాంబ అమ్మవారి  ఆలయ ఆవరణలో శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి శబరి పీఠం  వద్ద నిర్వహిస్తున్న  నిత్యా  అన్నదాన  కార్యక్రమానికి  17 వ వార్డు, ప్రశాంతి నగర్  ప్రాంతానికి  చెందిన కోట్ల రమణ వరలక్ష్మి దంపతుల ఆర్థిక సాయంతో   వారి పేర్ల మీద బుధవారం  ఒక్కరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  ప్రసాదాన్ని కొట్ల రమణ వరలక్ష్మి దంపతుల   చేతుల మీదుగా  వడ్డించే అవకాశాన్ని కల్పించారు. ప్రతి ఏడాది  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న  శ్రీ హరి హర పుత్ర  అయ్యప్ప స్వామి శబరి పీఠం ప్రతినిధులు ఎం. సీతారాం, కోడి బోయిన అప్పలరాజు, బోని దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి భక్తుల నుంచి  విశేష ఆదరణ కలుగుతుంది.  నిత్య అవసర ధరలు పెరిగిన నేపథ్యంలో     ఒక్కరోజు అన్నదానం చేయాలంటే ఎంతో కష్టంగా ఉన్న ఈ రోజుల్లో  ప్రతిరోజు అన్నదాన సేవకు ఎన్ని ఆటంకాలు  ఎదురైనా అయ్యప్పలకు ప్రసాదాన్ని అందించాలనే తలంపుతో  క్రమం తప్పకుండా   ప్రతిరోజు మధ్యాహ్నం  అన్న వితరణ చేయడం చాలా గొప్ప విషయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్న గురు స్వామి  కోడి బోయిన అప్పలరాజు ను స్థానికులు మెచ్చుకున్నారు. ముఖ్యంగా  దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో స్వాములు  పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించడం విశేషం. ఈ సందర్భంగా  గురుస్వామి  కోడిబోయిన అప్పలరాజు మాట్లాడుతూ నిత్య అన్నదానం మా చేతుల మీదుగా నిర్వహించే   అవకాశం  కలగడం మహా అదృష్టమని  కొనియాడారు. ఈ కార్యక్రమం  వచ్చేనెల  10 వ తేదీ వరకు ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని  తెలిపారు.  స్వామిలందరూ ప్రసాదాన్ని స్వీకరించి, తమ వంతు  సహాయ సహకారాలు అందించి,  స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.