ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత.
*శ్రీకాకుళం జిల్లా మంచినీటి సరఫరా కు మాస్టర్ ప్లాన్.
*రెండో ప్రాధాన్యత మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం.
*యల్ యన్ పేటలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కృషి
*జడ్ పి చైర్ పర్సన్ కొరికాన భవాని,సుడా చైర్మన్ రవికుమార్.
కొత్తూరు నవంబర్ 25(మేజర్ న్యూస్ ) ఉత్తరాంధ్ర అభివృద్ది కి జనసేన కట్టుబడి ఉందని జడ్ పి చైర్ పర్సన్ కొరికాన భవాని, సుడా చైర్మన్ రవికుమార్ అన్నారు. జడ్ పి చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సారిగా కొత్తూరు మండలం మెట్టూరు బిట్ వన్, మెట్టూరు బిట్ 3, గ్రామాలు పర్యటన కు వచ్చిన సందర్భంగా ఈవిధంగా అన్నారు. జిల్లా మంచినీటి ఎద్దడి నివారణ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.రెండో ప్రాధాన్యత గా గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు.యల్ యన్ పేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ మంజూరు కు కృషి చేస్తామాన్నారు. నియోజకవర్గం లో యన్ ఆర్ జి యస్ నిధులతో చేపట్టిన పంచాయతీ రోడ్లు అర్ధంతరంగా
నిలిచి పోయాయాని, ఏ కారణం చేత నిలిచి పోయాయో పరిశీలించి తగు చర్యలు తీసుకొంటామని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారని ,సాలూరు ,పాలకొండ, రాజాం మున్సిపాలిటీ లు చైర్మన్లు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్, పార్వతీపురం,శ్రీకాకుళం జిల్లా పరిషత్ లు జనసేన కు కేటాయించడం ఇందుకు నిదర్శనం మని అన్నారు. అభివృద్ధి లో జనసేన ముద్ర వేయడం తప్పదన్నారు.