BREAKING
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం

ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి.

Select Suryaa Now
ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి.


*మెట్టూరు బిట్ వన్ సర్పంచ్ అభ్యర్థి బర్రి స్వాతి.
*పంచాయతీ లో విస్తృత పర్యటన.
కొత్తూరు నవంబర్ 25(మేజర్ న్యూస్ ) కొత్తూరు మండలం మెట్టూరు బిట్ వన్ పంచాయతీ లో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మద్దత్తు తో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానని, తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి బర్రె స్వాతి అన్నారు.
తన మద్దత్తుదార్లు తో భారీ ఎత్తున ఊరేగింపు చేపట్టారు.
ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయాలని అభ్యర్థించారు.ఎమ్మెల్యే గోవిందరావు సూచనలు సలహాలు తీసుకొని గ్రామం సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్థానని ప్రకటించారు.నిర్వాసితులు సమస్యలు,పెన్షన్లు లేని పేద బడుగు వర్గాల వృద్దులకు మంజూరు కు కృషిచేస్తానని అన్నారు.ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా ప్రజలకు అందజేస్తామని అన్నారు గ్రామంలో సోలార్ లైట్లు ఏర్పాటు,విశ్రాంతి బల్లలు,మినీ లైబ్రరీ,ఇంటింటి కొళాయి లు ఏర్పాటు చేస్తామన్నారు . పదవ తరగతి ఆడపిల్లల కు ప్రోత్సహకాలు అందిస్తామని అన్నారు.ఆదర్శ పంచాయతీ గా తీర్చి దిద్దేందుకు ఒక్క సారి అవకాశం ఇవ్వాలని అన్నారు. గ్రామంలో భారీ ఎత్తున నిర్వహించిన ఊరేగింపు మహిళలు,యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్పంచ్ గా గెలిపించి ఎమ్మెల్యే కు మెట్టూరు బిట్ వన్ పంచాయతీ కనుక గా ఇచ్చేందుకు తనకు గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి బర్రె స్వాతి పిలుపునిచ్చారు.ఒకటవ వార్డు బర్రి సూర్యం,రెండు పోతల సూర్యం,మూడు వార్డు ఆగతముడి తిరుమల, ఆరవ వార్డు గొర్లె తెజేశ్వరి,7వ వార్డు కూనిపల్లి ఆదిలక్ష్మి ,వార్డు మెంబర్లు గా పోటీ చేస్తున్న వీరందరికి కేటాయించిన కుక్కర్ గుర్తు కు ఓటు వేయాలని కోరారు అదేవిధంగా 
4వ వార్డు చీమల తేజమ్మ, ఐదవ వార్డు కొట్నాల స్వాతి,ఎనిమిదవ వార్డు బర్రి హైమవతి వార్డు మెంబర్లు గా
పోటీ చేస్తున్న వీరికి గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం లో పేర్కొన్నారు.ఈ ర్యాలీ మాజీ సర్పంచ్ అదపాక శంకర్,దేశం నాయకులు రౌతు అనంతరావు 
,బర్రి గోవిందరావు,రాజారావు 
మోహనరావు ,బలవంతుల తిరుపతి రావు గొర్లె సురేష్ తదితరులు పాల్గొన్నారు.