మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం
వంగర. నవంబర్ 25 మేజర్ న్యూస్
విజయనగరం జిల్లా మగ్గూరు గ్రామంలో క్రీస్తు ప్రార్ధన మందిరాన్ని బుధవారం దైవజనులు ఐ జి ఓ ఎమ్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ జాకబ్ కలిగట్ల చేతుల మీదు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలి గట్ల .జాకబ్ ప్రసంగిస్తూ ఏసుక్రీస్తు మానవుడుగా అవతరించి శాంతి ప్రేమను పంచిపెట్టి విశ్వ మానవాళి శాంతి కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలు చదివి కష్టాలలో బాధలలో ఉన్న వారిని ఆదరించాలని ఇరుగుపొరుగు వారిని ప్రేమించాలని బోధించారు. క్రీస్తు ప్రార్ధన మందిరం పాస్టర్ కే ఆశీర్వాదం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పోలిరెడ్డి రమేష్ , మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ అప్పలనాయుడు. పాస్టర్ జాషువా హల్లెలూయా, డేవిడ్డేవిడ్ పౌలు IGOM టీం పాస్టర్. ఇమ్మానుయేల్. పాస్టర్ సంతోష్, పాస్టర్ మనస్సే , పలువురు దైవజనులు విశ్వాసులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.