BREAKING
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కి జనసేన ప్రాధాన్యత. సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ బెదిరింపులకు భయపడొద్దు..! కొరికాన దంపతులు ఆధ్వర్యంలో జనసేన లో చేరిక అయ్యప్ప ల నిత్య అన్నదానానికి చేయూత డ్రగ్స్ రహిత సమాజం కోసం ఐక్యంగా కదులుదాం! పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం

పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు

Select Suryaa Now
పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు

గంటా ఆదేశమే శిరోధార్యం

పద్మనాభం టిడిపి మండల అధ్యక్షులు కోరాడ రమణ

పద్మనాభం,నవంబర్ 25,మేజర్ న్యూస్:

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పొత్తు ధర్మాన్ని అందరూ తూచా తప్పకుండా పాటించాలని, పార్టీ ఆదేశాలను అధిగమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పద్మనాభం మండల టీడీపీ మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ కోరాడ రమణ హెచ్చరించారు.
పద్మనాభంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనసేన గానీ, బీజేపీ గానీ పోటీ చేసిన చోట వారికి అన్ని విధాలుగా సహకరించాలని తెలిపారు.అలాగే టీడీపీ తరపున పోటీ చేసిన వారికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సహకరించాలని గంటా శ్రీనివాసరావు తెలియజేసినట్లు కోరాడ రమణ అన్నారు.
ఇటీవల మద్ది పంచాయతీలో కాళ్ల నగేష్ కుమార్ మరియు అతని వర్గంలో సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ వేసిన వారికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు.
అలాగే కాళ్ల నగేష్ కుమార్ వర్గీయులు ఒక్కరు మినహా నగేష్ కుమార్ మరియు అతని వర్గం లిఖిత పూర్వకంగా తమకు సమాధానం తెలియజేసినట్లు చెప్పారు.ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలను స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తూచా తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోరాడ రమణ, క్లస్టర్ ఇంచార్జ్ కె రామరాజు,వైస్ ఎంపీపీ కాళ్ల నగేష్ కుమార్, కసిరెడ్డి దామోదరావు,తదితరులు పాల్గొన్నారు.