48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు.
కాంట్రగడ జంక్షన్ వద్ద ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు - బైక్‌తో సహా మద్యం సీజ్.
పలాస, నవంబర్ 25,మేజర్ న్యూస్.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలాస మండలం,కాంట్రగడ జంక్షన్ వద్ద ఎక్సైజ్ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో బైక్‌పై 48 ఒడిశా మద్యం సీసాలు తరలిస్తున్న రోణంకి శేషగిరి అనే వ్యక్తి ని అరెస్టు చేశారు.ఈ దాడుల్లో ఎఈఎస్ టాస్క్ ఫోర్స్ సీఐ మధుకుమార్,పలాస ఎక్సైజ్ సీఐ మల్లికార్జున రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.నిషేధిత మద్యాన్ని ఎన్.డి.పి.ఎల్ గా గుర్తించి మద్యంతో పాటు బైక్‌ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఎవరైనా అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.