ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు
బొబ్బిలి, నవంబర్ 25: మేజర్ న్యూస్: బొబ్బిలి మండలంలో పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లు తనిఖీ ని బొబ్బిలి ఆర్డీవో జెవిఎస్ఎస్ రామ్ మోహన్ రావ్ పరిశీలించారు. అలాగే ఎన్నికల సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎంపిడిఓ పి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 1100 భోజనాలు అందించడం జరుగిందని, అయితే సహాయకులు కూడా రావడం వలన ఒక 150 మంది వరకు భోజనం తక్కువ వచ్చినది వెంటనే తిరిగి ఆర్డర్ ఇవ్వడం మరియు వారు తీసుకోవడం కూడా జరుగుతున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.