BREAKING
పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి జమ్మూ కాశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదుల సంచారం.. షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తే అది అప్పగింత అభ్యర్థనకు వేరు:భారత్ స్పష్టీకరణ.. జర్మనీలో సహజ వాయువు నిల్వల పెంపునకు యూనిపర్ రూ. 1,100 కోట్ల పెట్టుబడి: ఎయిర్ ఇండియా–ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాల్లో భారీ మార్పులు: డాయిష్ బ్యాంక్–పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ఒప్పందం: జర్మనీ రక్షణ సంస్థ హెల్సింగ్ భారీ కొనుగోలుకు సిద్ధం: స్పెయిన్ రక్షణ సంస్థ ఇండ్రా భారీ లక్ష్యం.. 2030 నాటికి 12 బిలియన్ యూరోల ఆదాయం: అమెరికా, చైనాకు పోటీగా యూరప్ భారీ సాంకేతిక పెట్టుబడి నిధి : గూగుల్‌పై మలేషియా ప్రభుత్వం రూ. 1,300 కోట్ల దావా: నేటి రాశి ఫలాలు 26 నవంబర్, 2026 నేటి పంచాంగం26 నవంబర్, 2026 అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి కోటి దీపోత్సవంలో పాల్గొన్న జగన్నాధుల మణిదీప్ శర్మ అభివృద్ధిపై చర్చకు సిద్ధం

పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి

Select Suryaa Now
పామూరు భవిష్యత్తు కోసం కప్పు సాసర్‌కు ఓటేయండి

- మేజర్ పంచాయతీ సమగ్ర అభివృద్ధే నా సంకల్పం

పామూరు, మేజర్ న్యూస్ : పామూరు పట్టణ అభివృద్ధికి తనకు ఒక అవకాశం కల్పించి కప్పు సాసర్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని టిడిపి కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్ షంసూర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ పంచాయతీగా విస్తరించిన పామూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తన ప్రధాన లక్ష్యమన్నారు. పట్టణంలోని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. సర్పంచ్ పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తానని, తనపై ప్రజలు ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. నేడు జరిగే ఎన్నికల్లో కప్పు సాసర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించి పామూరు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని షేక్ షంసూర్ విజ్ఞప్తి చేశారు.